Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్18న రాష్ట్రవ్యాప్త బీసీ బందును జయప్రదం చేద్దాం

18న రాష్ట్రవ్యాప్త బీసీ బందును జయప్రదం చేద్దాం

- Advertisement -

బీసీ సంఘాలు,  అఖిలపక్షం 
నవతెలంగాణ – జోగులంబ గద్వాల

గద్వాల జిల్లా కేంద్రంలోని  సృతి వనం పార్కు సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 స్టే ని వ్యతిరేకిస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వం మాత్రం  42% బిసి రిజర్వేషన్ పైన ఆమోదం తెలపకుండా బీసీలకు అన్యాయం చేస్తుందని బిసి సంఘాలు జోగులాంబ గద్వాల జిల్లా అఖిలపక్ష నాయకులు విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ పోరాటం ఉదృతం చేస్తామని వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఈనెల 18న తెలంగాణ బందుకు పిలుపునిస్తున్నట్టు బీసీ సంఘాలు, అఖిలపక్ష నాయకులు తెలియజేశారు. కావున 18న జరిగే రాష్ట్రవ్యాప్త బీసీ బందు లో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు అఖిలపక్ష నాయకులు వ్యాపారులు జిల్లా ప్రజలు బిసిబందుకు సహకరించాలని కోరుతున్నాం పాల్గొన్న సంఘాలు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మధుసూదన్ బాబు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు కే ప్రభాకర్, భాహుజన రాజ్యసమితి నాయకులు వాల్మీకి, దళిత ఐక్యవేదిక నాయకులు మోహన్ , మైనార్టీ నాయకులు రెహమాన్, టిఆర్ఎస్వి నాయకులు కురవ పల్లయ్య ,అల్లంపూర్ బీసీ సంఘం నాయకులు  గొంగల్లాఈశ్వర్ ప్రవీణు, రామాంజనేయులు ,మధు, కే శివ, సాధతుల్లా, రైమతుల్లా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -