Sunday, October 12, 2025
E-PAPER
Homeకరీంనగర్రమేష్ కుటుంభానికి  ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలి

రమేష్ కుటుంభానికి  ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలి

- Advertisement -

కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముశం రమేష్ డిమాండ్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

గంభీరావుపేటకు చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు రమేష్ మరణించగా ఆయన కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. రమేష్ చెరువులోని నీది పంపు రిపేర్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించగా ఆయన మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తీసుకురాగా సీపీఐ(ఎం) నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేనట్టుగా ఉన్నది చెరువులో బావి దగ్గరికి వెళ్లడానికి వీలు లేకుండా కూడా వెళ్తే ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా బలవంతంగా రమేష్ పని చేయాలని పంపించడం వలన రమేష్ మరణించడం జరిగింది అని అన్నారు. రమేష్ మరణానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే వహించాలన్నారు.  ఘోర ప్రమాదం జరిగిన కూడా కలెక్టర్ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవని అన్నారు. కుటుంబానికి వెంటనే ఆర్థిక సాయం అందించే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ రకంగా గ్రామపంచాయతీ కార్మికుల పట్ల పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది గ్రామపంచాయతీ కార్మికుల ప్రాణాలకు  విలువలు లేవా  అణగారినా వర్గాలు కావడంవల్ల ప్రభుత్వం  పూర్తిగా నిర్లక్ష్యం ధోరణి కొనసాగిస్తుందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు భద్రత కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. వెంటనే రమేష్ కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. లేనిపక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని గ్రామపంచాయతీ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్షులు మల్యాల నరసయ్య ఇల్లంతకుంట మండల అధ్యక్షులు వర్కోలు, మల్లయ్య, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు బూర శ్రీనివాస్, గంభీరావుపేట్ మండల అధ్యక్షులు ఆంజనేయులు ముస్తాబాద్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు మహేష్, చీర్లవంచరవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -