Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య 

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య 

- Advertisement -

తండ్రి చితికి తలకొరివి పెట్టిన కూతురు 
రూ. 10వేల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే 
నవతెలంగాణ -పెద్దవంగర
ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్సై హిదాయత్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవంగర గ్రామానికి చెందిన పొర్ల సతీష్- మమత దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు వర్షిత, హర్షిత సంతానం కలరు. సతీష్ (29) రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా ఆయన తాగుడుకు బానిసై, కుటుంబ భాధ్యతలను పట్టించుకోకుండా, జులాయిగా తిరుగుతున్నాడు. గత కొంత కాలంగా తల్లిదండ్రులతో కలిసి ఆయన స్థానిక డబుల్ బెడ్ రూం ఇంట్లో ఉంటున్నాడు.

శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తల్లి ఐలమ్మ, రోజూ మాదిరిగానే కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒక్కగానొక్క కొడుకు అకాల మరణం చెందడం పట్ల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబాన్ని పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సంజయ్, రాము, శ్రీనివాస్, లక్ష్మయ్య పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

తండ్రి చితికి తలకొరివి పెట్టిన కూతురు..

ఉరివేసుకుని తండ్రి సతీష్ (29) మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండడంతో తొమ్మిదేళ్ళ పెద్దకుమార్తె వర్షిత తండ్రి చితికి తలకొరివి పెట్టింది. తండ్రి అకాల మరణం పట్ల భార్య మమత, ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. వారు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. తల్లీకూతుళ్లను ఓదార్చడం ఎవరితరం కాలేదు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే..

మండల కేంద్రానికి చెందిన సతీష్ ఉరివేసుకుని మృతి చెందడం పట్ల పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సానుభూతిని ప్రకటించారు. నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాల కోసం ఎమ్మెల్యే సహకారంతో కాంగ్రెస్ మండల నాయకులు డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. 10 వేలు అందజేశారు. సతీష్ మృతదేహాన్ని కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బాధిత కుటుంబాన్ని అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, మహిళా అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, బోనగిరి లింగమూర్తి, చిలుక సంపత్, చిలుక సోమయ్య, అనపురం వినోద్, పేరం నరేష్, షరీఫ్, రషీద్, ఏసయ్య, వెంకన్న, రాము, సురేష్, వీరన్న తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -