Sunday, October 12, 2025
E-PAPER
Homeఖమ్మంకాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

- Advertisement -

– సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా నేత గోకినెపల్లి ప్రభాకర్
నవతెలంగాణ – అశ్వరావుపేట
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సీఎం రేవంత్ గాలికొదిలేసారని,ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అమలు చేస్తామన్నారు. ఆరు హామీలు సైతం సక్రమంగా అమలు కావడంలేదని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా డివిజన్ కార్యదర్శి గోకినెపల్లి ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం గుమ్మడివల్లి, బచ్చువారి గూడెం ఎంపీటీసీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల సర్వసభ్య సమావేశం  కోయ రంగాపురం గ్రామంలో కంగాల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా గోకినెపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు తీసుకొని ఓటు వేయడం వల్ల ఓటర్లు నష్టపోతున్నారని,కేవలం రూ.500 లో రూ. 1,000 లు తీసుకొని ఓటు వేయడంతో గెలిచిన వారు ఆ రూ. 500 లతో ఐదేళ్ల పాటు 1825 రోజుల పాటు మన పైన పాలన కొనసాగిస్తారు అని అన్నారు. అంటే రోజుకి మనము మన హక్కుని అర్ధ రూపాయికే అమ్ము కుంటున్నామన్నారు. ఒక ఓటు విలువను మనము అర్ధ రూపాయి గా అంచనా వేస్తే, మన భవిష్యత్తు,మన గ్రామం, మన కుటుంబం జీవితం కూడా అంతే ఎక్కువవుతుంది.ఓటు ఒక పవిత్రమైన హక్కు అది మన భవిష్యత్తును,మన పిల్లల భవిష్యత్తును నిర్మించే పత్రం,దానిని అమ్ముకో వద్దని అన్నారు.

అలాగే స్థానిక సంస్థలకు వచ్చే నిధులను దుర్వినియోగం చేయకుండా,అవినీతి లేకుండా వినియోగించినప్పుడే పల్లెలు కళకళలాడతాయని అన్నారు. నిస్వార్థంగా పని చేసే వారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని కోరారు. పెత్తం దారులకు అవకాశం ఇవ్వొద్దు న్నారు. ప్రజలకు స్థానిక పాలనలో భాగస్వాములను చేయడం బూర్జువా పాలకులకు ఇష్టం ఉండదన్నారు.అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సి పి ఐ యంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కంగాల కల్లయ్య, మండల కార్యదర్శి వాసం బుచ్చి రాజు,  పూసం శారద, బంధం సత్తిరాజు, సోడెం కన్నా రావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -