- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీకి అయినా శ్రామికులు,కార్మికులే పునాదిగా ఉంటారని, క్షేత్రస్థాయిలో కార్మిక సంఘాలు విస్తరిస్తే నే కమ్యునిస్టు పార్టీలు గట్టిపడతాయి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆదివారం అశ్వారావుపేట సీఐటీయూ అనుబంధ హమాలి శాఖల సమావేశం స్థానిక ప్రజాసంఘాలు కార్యాలయంలో ఏసు అద్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పుల్లయ్య మాట్లాడుతూ ప్రజాసంఘాలు బలోపేతం తోనే జనతా ప్రజాస్వామిక విప్లవం సిద్ధిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి సోడెం ప్రసాదరావు,మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు,రాము తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -