Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య 

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య 

- Advertisement -

 నవతెలంగాణ-కోహెడ 
మండల కేంద్రానికి చెందిన  వేల్పుల సంపత్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… ఇటీవల దసరా పండుగ నేపథ్యంలో అత్తగారి ఇంటికి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామానికి సెలవులకు వెళ్ళాడు. అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని తన భార్యతో వివరిస్తూ విచారం వ్యక్తం చేశాడు. అలాగే గతంలో సైతం పలుమార్లు తన భార్యతో తన మనోవేదనను తెలుపుతూ కుంగిపోయాడు. దింతో  అత్తవారింట్లో గత బుధవారం రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో  గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే  కరీంనగర్ ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. కాగా మృతుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడడం దారుణమని  ఫైనాన్స్ కంపెనీలు దీనిపై బాధ్యత వహించాలని  ఎమ్మార్పీఎస్  మండల కన్వీనర్ మంద మల్లేశం అన్నారు. అలాగే మృతుడు గతంలో ప్రభంజన పథం స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాడు. జీవనోపాధి కోసం చెప్పుల షాప్ నిర్వహించుకుంటూ జీవనాన్ని గడిపేవాడు. హుస్నాబాద్ నియోజకవర్గంలో రిపోర్టర్ గా ఆయనకున్న పరిచయాలతో  పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో  గ్రామంలో విషాదఛయాలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -