Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిచ్కుంద ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

బిచ్కుంద ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
బిచ్కుంద పట్టణ ముదిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని ముదిరాజ్ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అధ్యక్షుడిగా పిట్ల సాయికుమార్, ఉపాధ్యక్షుడిగా బంటు శ్రీనివాస్, కార్యదర్శులుగా పుట్ట రమేష్, బసన్ బోయిన గణేష్, సలహాదారులుగా దుబ్బ నాగరాజ్, తాటి శంకర్ లను ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించినందుకు సంఘం అభివృద్ధి కోసం సహాయ శక్తుల  కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో గోపి బశెట్టి, బసంబోయిన హనుమాన్లు, తౌటి సాయిలు, దుబ్బ గోపాల్, దుబ్బ,  సాయిలు, కప్పగణేష్, పిట్ల ప్రకాష్, మాడరాములు, హోటల్ కాశీరాం, దుబ్బా అశోక్ సార్, మాజీ అధ్యక్షులు సాయిరాం, కార్యదర్శి సచిన్, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -