Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభాకర్ కుమారున్ని పరామర్శించిన అన్వేష్ రెడ్డి 

ప్రభాకర్ కుమారున్ని పరామర్శించిన అన్వేష్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట మండలంలోని మచ్చాపూర్ గ్రామానికి చెందిన ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్ కుమారుని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సంకేత అన్వేష్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ప్రభాకర్ కుమారుడు ఇటీవల పాము కాటుకు గురై ఆస్వాస్థత చెందారు. విషయం తెలుసుకున్న అన్వేష్ రెడ్డి ప్రభాకర్ ఇంటికి వచ్చి పరామర్శించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ములుగు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనేటి శ్యామ్, జంపాల సాగర్, జంపాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -