Tuesday, May 13, 2025
Homeదర్వాజమంచుపూలు పూయాలిప్పుడు!

మంచుపూలు పూయాలిప్పుడు!

- Advertisement -

శాంతిహొ రెక్కలకు
మనిషి నెత్తురు పూసే విధ్వేషానికి
ఏ మతం పేరు పెడదాం?
అది ఇస్లాం కాదు, హిందూ కాదు
ఉన్మాదం నెత్తురంతా నిండిన
క్రూర మగం అందాం
హిందువులో ముస్లింలో కాదు!
ఉన్మాదుల తూటాలకు రాలిపోయేది మనుషులే
విద్వేషపు మంటల్లో కాలిపోయేదీ మనుషులే
అచ్చం మనలాంటి మాన ప్రాణాల మనుషులే
మామూలు మనుషులే!
నువ్వే చెప్పు నిజం కాదా?
నాలుగు రోజుల పర్యటనకొచ్చిన
జీవన యాత్రికులు కాదా మనుషులు
పిల్లల్లా పెద్దల్లా కుటుంబాలుగా సమూహాలుగా
సంతోషాలు ప్రవహించే నదుల్లా
సూఫీ దారుల్లో సాగిపోయే
బాటసారులు గదా మనుషులు
కాస్త రొట్టె, కొన్ని బట్టలు,
కలత నిద్రలు లేని ఇళ్లు
శాంతి సామరస్యం
ఏండ్ల తరబడి ఆ మనుషులు కలగనేది అంతే!
ఈ రోజు ఇక్కడ మరో రోజు మరో చోట
దేశాలుగా, మతాలుగా విడదీస్తూ
నిత్యం భయం నీడల్లా
వాళ్ళ బతుకుల్లోకి చొరబడుతూ
మతం వేషంలో విద్వేషం
దేశభక్తి ముసుగులో విద్వేషం
ఏ వేషం వెనకాల ఏ హస్తం ఉందో
ఏ ముసుగును ఏ ముఖంహొ
కప్పుకుందో కనిపెట్టాలి
మానవతను హత్య చేసే
విద్వేషిని అంతం చేసే వీరులు కావాలిప్పుడు!
ఓ వీరావేశ మాధ్యముడా కచ్చితంగా నిద్రలేపు!
హిందువునో, ముస్లింనో కాదు
భారతీయతను మేల్కొలుపు
మన లోపలి ‘మనిషి’ని మేల్కొలుపు!
మనిషికీ మనిషికీ మధ్య
భగ్గుమంటున్న మతం గడ్డి చల్లారి
మనుషులు తిరుగాడే దారుల్లో
మంచు పూలు పూయాలిప్పుడు!

  • రహీమొద్దీన్‌, 9010851085
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -