Monday, October 13, 2025
E-PAPER
Homeదర్వాజఫీనిక్స్‌

ఫీనిక్స్‌

- Advertisement -

ఆకలిని కూడా నువ్వు ఆయుధం చేసి
అసహాయుల మీద సంధిస్తున్నప్పుడు
మహా సముద్రమంత మానవత
ఫ్లాటిల్లా పగడపూల వనమై విరబూసింది
నీ రాకాసి సునామీ కోరలకు బలైంది
గుర్తుంచుకో యుద్ధం ఎవరు గెలిచినా
నువ్వు పరాజితుడివే.
శరదతు వర్షపు లే ఎండలో
ఆలివ్‌ ఆకులల్ల విరిసిన
సింగిడి మీద నెత్తుటి మరకలు
అందమైన ‘అటాబా’ గానవేదిక మీద
నీ వికత శబ్దాల హంతక హోరు
‘టాట్రిజ్‌ ఎంబ్రాయిడరీ’ అద్దిన
మఖ్‌మల్‌ తివాచీల మీద
తెగిపడ్డ శిశువుల అవయవాలు
లేలేత అందాల ఆపిల్‌ తోటలల్ల
నువ్వు ఎరువులుగా చల్లిన నెత్తుటి నదాలు
తల తెగిపడ్డ మొండాలను ఒడిన చెర్చుకున్న
విరగ పండిన గోధుమ పొలాలు
మతాల త్రివేణి సంగమం మట్టిమీద
నీ ఉన్మాదపు రాబందుల దాడి
నేల లేని దేశంలో
వాళ్ళు ‘భూమిని తమ రక్తంలో
మోస్తున్నారని’ గుర్తుంచుకో-
ప్రథమ సంగ్రామపు కుట్ర వాగ్దానంలో
ఇజ్రాయిల్‌ వికత శిశువు జననం
మంచి మనుషులు పంచిన ఒక అపాత్రదానం
‘నక్బా’లో తమ నేలను కోల్పోయి
తుఫాను గాలికి చెల్లా చెదురైన భూమి పుత్రులు
అయినవారు అండగా నిలిచినా
ఆరు రోజుల యుద్ధంలో
గుండె కోల్పోయిన దేశ దేహం
మొదటి ఇండిఫాడా విసర్జించిన ఓస్లో ఒప్పందం
చెత్త బుట్టల పడ్డ ఉట్టి కాగితపు మూట
రెండవ ఇంటిఫాడా మిగిల్చింది
జీవం పోయిన సగం దేహాన్నే
పతాV్‌ా- అరాఫత్‌ ఆత్మ ఆశల బూడిద కుప్ప
హమాస్‌- ఒక అనివార్య ఆక్రోషపు పురిటి బిడ్డ
పెట్టుబడికి పుట్టిన రాకాసి శిశువులు మీరు
మీ ఆయిల్‌ దాహం అంతులేనిది
ఈ భూమి మీద మీవి వామన పాదాలు
సమస్య మానవాళి నిటారుగా నిలబడి
నినదిస్తోంది విను-
వీటో వేటు చాటున
డాలర్‌ బలుపు నీడన
నీ కాగితం పులి హుంకరింపులకిక చెల్లు.
పాలస్తీనా ఒక ఫీనిక్స్‌
మెసపటోమియా ఆవిర్భావంలో పుట్టి
బైజాంటైన్‌ బాబిలోనియన్‌ ల మీదుగా పరుగులెత్తి
ఓట్టోమన్‌ సామ్రాజ్యంలో ఉద్దీపనం పొంది
క్రూసేడ్‌ కత్తుల వంతెనల కాలాన్ని దాటి
రోమన్‌ సామ్రాజ్య స్మశానవాటికమీంచి
లేచొచ్చిన కనానీయులు
ఒక ఫీనిక్స్‌ అదే పాలస్తీనా ఒక ఫీనిక్స్‌.

  • డా|| కాసుల లింగారెడ్డి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -