Tuesday, May 13, 2025
Homeదర్వాజఆశ ఒక్కటే..

ఆశ ఒక్కటే..

- Advertisement -

బాధ చాటున
ముసుగేసుకున్న ఆనందం
తెర చాపల వెనుక తొంగి చూస్తున్న వేళ..
కన్నీళ్లు! కలలను కంటూ.. కడలి
కెరటాలు గా పొంగుతున్న సమయంలో..
ఆశ ఒక్కటే..రేపటి గమ్యం వైపు
నడిపించే బాధ్యత ను
భుజాల మీద వేసుకొని
నడిపిస్తున్న దశ్యం..
ఒక విజయ తీరం…స్వాగతం
పలుకుతున్నట్లు వుందీ కదా నేస్తం.!
నిరాశ దుప్పట్లను పక్కనెట్టి
గుండెల్లో రగులుతున్న మంటల్ని
చల్లార్చుకోవడానికి అడుగు ముందుకు
వేయు నేస్తం..
నీ ఆశయల్ని అడ్డుకున్న చేతులే
చప్పట్లతో పూల వర్షం కురిపిస్తాయి.!!

  • కొండా రవీందర్‌, 9059237771
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -