విశాఖపట్నం : మహిళల క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్, హైదరాబాదీ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 1999-2022 వరకు సుదీర్ఘ కాలం భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మిథాలీ రాజ్‌ను ఆంధ్ర క్రికెట అసోసియేషన్ (ఏసీఏ) సముచితంగా గౌరవించింది. వైజాగ్‌లోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మిథాలీరాజ్ పేరిట ఓ స్టాండ్ ఏర్పాటు చేసింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన కార్యక్రమంలో మిథాలీరాజ్ స్టాండ్‌ను ఆమె సమక్షంలోనే ఆవిష్కరించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఐసీసీ చైర్మెన్ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవాజిత్ సైకియా సహా ఆంధ్ర క్రికెట్ సంఘం ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిథాలీరాజ్ 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20ల్లో భారత్‌కు ఆడింది. వన్డేల్లో 7805 పరుగులు, టీ20ల్లో 2364 పరుగులు, టెస్టుల్లో 699 పరుగులు చేసింది.