Monday, October 13, 2025
E-PAPER
Homeఆటలుకాలికట్‌ హీరోస్‌ నాల్గోసారీ..

కాలికట్‌ హీరోస్‌ నాల్గోసారీ..

- Advertisement -

ఢిల్లీ తుఫాన్స్‌ చేతిలో 0-3తో ఓటమి
వాలీబాల్‌ లీగ్‌ సీజన్‌ 4


నవతెలంగాణ- హైదరాబాద్‌
ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) సీజన్‌ 4లో ఢిల్లీ తుఫాన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో నిరాశపరిచిన ఢిల్లీ తుఫాన్స్‌ ఆ తర్వాతి రెండు మ్యాచుల్లో మెరుపు విజయాలు నమోదు చేసింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పీవీఎల్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కాలికట్‌ హీరోస్‌పై ఢిల్లీ తుఫాన్స్‌ 15-11, 15-9, 15-11తో గెలుపొందింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కాలికట్‌ హీరోస్‌ ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ పరాజయం పాలై సెమీఫైనల్‌ ఆశలను దాదాపుగా ఆవిరి చేసుకుంది!. జీసన్‌ చౌరియో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కాలికట్‌ హీరోస్‌ తరఫున సంతోశ్‌, రహీమ్‌, వికాస్‌ మాన్‌ సహా లిబరో ఆదర్శ్‌లు రాణించినా.. మ్యాచ్‌ను నాల్గో సెట్‌కు తీసుకెళ్లడంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ విఫలమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -