Monday, October 13, 2025
E-PAPER
Homeఆటలుసివి ఆనంద్‌ అజేయ సెంచరీ

సివి ఆనంద్‌ అజేయ సెంచరీ

- Advertisement -

హెచ్‌సీఏ వన్‌డే లీగ్‌ చాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సి-డివిజన్‌ వన్‌డే లీగ్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ హౌంశాఖ ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్‌ అజేయ సెంచరీ సాధించారు. హెచ్‌పీఎస్‌ బేగంపేట్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన సికింద్రాబాద్‌ క్లబ్‌ 35 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఓపెనర్‌గా ఆడిన సీవీ ఆనంద్‌ 90 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మరో ఓపెనర్‌ జంషెడ్‌ (66) అర్థ సెంచరీతో మెరిశాడు. హెచ్‌పీఎస్‌ బేగంపేట్‌ నిర్ణీత 35 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులే చేసింది. సికింద్రాబాద్‌ క్లబ్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -