టీజర్, లిరికల్ సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమాను నవంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నేటి సమాజంలో యూత్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంగా కంప్లీట్ ఎంటర్‌టైన్ మెంట్, ఛాట్ బస్టర్ మ్యూజిక్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల దష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ చిత్రంలో విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం క్యారెక్టర్ లో నవ్వించ బోతున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్.
యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -