రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. హిమాంశు పోపూరి నిర్మిస్తుండగా, అక్కినేని కుటుంబరావు తెరకెక్కించారు. కథ, మాటలు, పాటల్ని ఓల్గా అందించారు. లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ వేడుకలో నిర్మాత హిమాంశు పోపూరి మాట్లాడుతూ, ‘ఈ స్టోరీ విన్న వెంటనే కనెక్ట్ అయ్యాను. ఇందులో ఓ పాత్ర కూడా చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’ అని అన్నారు.
‘మంచి సినిమా రావాలని కోరుకునే ఆర్టిస్టులు మాకు దొరకడం మా అదష్టం. ఈటీవీ విన్ మా సినిమాను తీసుకోవడం మరో అదష్టం. పెద్దవాళ్లందరూ కలిసి నటించిన చిత్రమే అయినా ఇది యువతరానికి సంబంధించిన కథ’ అని రచయిత్రి ఓల్గా అన్నారు. దర్శకుడు అక్కినేని కుటుంబరావు మాట్లాడుతూ,’కోట్లు సంపాదించేందుకు పరుగులు పెడుతున్నారు.. కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు. అందరిలోనూ ఆలోచనను రేకెత్తించేలా ఈ సినిమాను తెరకెక్కించాను’ అని తెలిపారు. ఈటీవీ ప్రతినిధి సంధ్య మాట్లాడుతూ, ‘ఇది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు. ప్రస్తుతం ఉన్న తరానికి అవసరయ్యే చిత్రమిది. ఈటీవీ విన్‌లో ఈ మూవీ ఈనెల 16న రాబోతోంది’ అని అన్నారు. ‘ఇంత గొప్ప సినిమాను మాకు ఇచ్చిన కుటుంబరావుకి థ్యాంక్స్. సంగీత దర్శకుడు రాధాకష్ణన్ మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని ఈటీవీ ప్రతినిధి నితిన్ చెప్పారు.
ఆలోచన రేకెత్తించే ప్రేమకథ
- Advertisement -
- Advertisement -