Monday, October 13, 2025
E-PAPER
Homeసినిమాకంటెంట్‌ మీద నమ్మకంతో..

కంటెంట్‌ మీద నమ్మకంతో..

- Advertisement -

బీవీ వర్క్స్‌ బ్యానర్‌ మీద బన్నీ వాస్‌ సమర్పణలో ప్రియదర్శి, నిహారిక ఎన్‌ ఎం హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిత్రమండలి’. విజయేందర్‌ దర్శకత్వంలో సప్తాస్వ మీడియా వర్క్స్‌ మీద కళ్యాణ్‌ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. ఈ మూవీ ఈనెల 16న రిలీజ్‌ కాబోతోంది. కథలోని కంటెంట్‌ మీద ఉన్న నమ్మకంతో ఈనెల 15న ప్రీమియర్లతో ఆడియన్స్‌ ముందుకు రాబోతోన్నట్టుగా మేకర్స్‌ ప్రకటించారు. సినిమా చాలా బాగా రావడం, ఆద్యంతం నవ్వించే బడ్డీ కామెడీ మూవీ కావడంతో ఒక రోజు ముందుగా ప్రదర్శించాలని టీం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ చిత్రం ప్రస్తుతం ‘ఐఎండీబీ’లో ట్రెండ్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలోనూ పాజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ అయ్యాయి. దీంతో ఈ దీపావళికి సరైన కుటుంబ కథా చిత్రమనే నమ్మకాన్ని మేకర్స్‌ వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -