Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అలంపూరు పట్టణ అభివృద్ధికై రూ.15 కోట్లు మంజూరు..

అలంపూరు పట్టణ అభివృద్ధికై రూ.15 కోట్లు మంజూరు..

- Advertisement -
  • – నిధుల మంజూరులో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కృషి
    – రాష్ట్ర టెలికాం సలహా (టిఏసి) కమిటీ సభ్యులు మహమ్మద్ ఇస్మాయిల్
    నవతెలంగాణ-అలంపూరు
  • జోగులంబ గద్వాల జిల్లా పరిధిలోని అలంపూరు పట్టణ  అభివృద్ధి చేసేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేసిందని  తెలంగాణ రాష్ట్ర టెలికాం సలహా (టిఏసి) కమిటీ సభ్యులు మహమ్మద్ ఇస్మాయిల్ ఒక ప్రకటనలో తెలిపారు. నిధుల మంజూరు కోసం ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ కృషి చేశారని తెలిపారు. ఈ నిధులతో అలంపూర్ పట్టణంలోని పాత ఆర్డీఎస్ కార్యాలయం నుండి న్యూ ఫ్లాట్స్ కాలనీలోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు రోడ్డు విస్తరణ,  డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు, అక్బర్ పేట కాలనీలో  సిసి రోడ్లు, అక్బర్ పేట కాలనీ నుండి పాపనాశి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం, పట్టణంలోని ప్రధాన సర్కిల్ విస్తరణ, సుందరీకరణ పనులు, అలంపూర్ మున్సిపాలిటీ ఆయా వార్డుల్లో  సీసీ రోడ్లు, అంబేద్కర్ కాలనీ నందు వడ్డే గుంతలో  విశాలమైన పార్క్ ఏర్పాటు, సుందరీకరణ పనులు, పట్టణంలోని అండర్ డ్రైనేజీ  కి నూతన పైపు లైనింగ్ ఏర్పాటు వంటి పనులను నిర్వహిస్తున్నట్లు మహమ్మద్ ఇస్మాయిల్ తెలిపారు. నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, అందుకు కృషి చేసిన సంపత్ కుమార్ కు అల్లంపూర్ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -