సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యూనియన్ గౌరవాధ్యక్షులు భూపాల్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యూనియన్ గౌరవ అధ్యక్షులు గోపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు )నిజామాబాద్ జిల్లా 7 మహాసభ సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు.ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ హాజరయ్యారు. సిఐటియు జిల్లా నాయకులు షాదుల్లా అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు జిల్లాలోని ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నిషన్ లు ఆరోగ్య మిత్రాలు, 104 ఉద్యోగులు తదితర రంగాల నుండి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ.. మెడికల్ డిపార్ట్మెంట్లోని కాంట్రాక్టర్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అందరికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఏఎన్ఎంల పని భారం తగ్గించాలని,1930 ఏ ఎన్ ఎం పోస్టులు , 2300 నర్సింగ్ ఆఫీసర్స్, 1284 ఎల్ టి, 735 ఫార్మసిస్ట్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆరోగ్య శ్రీ మిత్రల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 104 ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వాలని, స్వంతజిల్లాలో నియమించాలని కోరారు. వైద్య ఆరోగ్య రంగానికి బలమైన ఆయువు పట్టుగా ఉండి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏ.ఎన్.ఎంలు రెండు దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నేటికీ రెగ్యులర్ కాకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు, ఏఎన్ఎంలు ఏకకాలంలో 36 రకాల రికార్డులు ఆన్ లైన్ లో,ఆఫ్ లైన్ లో నమోదు చేస్తున్నారని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అన్నారు.
గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలకు 8,9,10 పి.ఆర్.సి ల ప్రకారం బేసిక్ పై ఇచ్చారు, కానీ ప్రస్తుతం తెలంగాణలో తొలి పిఆర్సి బేసిక్ పే ఇవ్వకుండా 30% వేతనాలు పెంచడం వలన ఏఎన్ఎంలు ప్రతినెలా 5 వేల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,ప్రభుత్వం వెంటనే బేసిక్ పై ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని అన్నారు,రెండవ ఏఎన్ఎంలు,ఈ.సీ ఎ.ఎన్.ఎంలు,అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న కనీస వేతనాలు ఇవ్వకుండ, రెగ్యులర్ చేయకుండ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు, ప్రభుత్వం వెంటనే వీరందరిని ఎలాంటి షరతులు లేకుండ యధావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేయకుంటే భవిష్యత్తులో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మురళి సావిత్రి, ధనలక్ష్మి, రాము గౌడ్, జీవన్ రెడ్డి, టి రమేష్, సురేష్, ప్రసాద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.