బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా
నవతెలంగాణ – కంఠేశ్వర్
పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యొక్క 250 కోట్ల రూపాయలను విడుదల చేయాలి అని జె ఏ సి నాయకులు నవాతే ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జె ఏ సి నాయకులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 300 పైగా ఉన్నాయి వీటిలో సుమారు 250 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి ఈ యొక్క బకాయిలను వెంటనే రిలీజ్ చెయ్యాలని వెనుకబడిన తరగతుల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల న్యాయం చేయాలని వీరిపై చిన్న చూపు చూడడం సరికాదని లేని పక్షాన తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను కీలకమైన పాత్ర అలాంటి విద్యార్థుల పైన చిన్నచూపు చూడడం సమచితల్లి ప్రేమ చూపించడం సరికాదు అని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో జేఏసీ నాయకులు దేవర్ల నాగరాజు, రాజన్న, ఆర్ గౌతమ్ కుమార్, సంజయ్, మోసిన్, బాలరాజ్, ప్రశాంత్, శ్రీకాంత్, మోహన్, కిరణ్, సతీష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES