Monday, October 13, 2025
E-PAPER
Homeజిల్లాలుమరోసారి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరోసారి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ – జడ్చర్ల
మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని, ఇందుకు రంగం సిద్దమైందన్న ప్రచారంపై అనిరుధ్ రెడ్డి స్పందించారు. ఇక్కడ ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చని హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరి సెక్యూరిటీ అడగాలా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మేము ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. వారికి గేటు వద్దకు వెళ్తే కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకదని, కావాలనే ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లరరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ క్లారిటీతో ఉన్నారన్నారు. కాగా ఎర్ర శేఖర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -