నవతెలంగాణ – హైదరాబాద్: ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ప్లేట్ లీగ్ సీజన్‌లో బిహార్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ను ఢీకొట్టనున్నది. ఈ లీగ్‌కు బిహార్ క్రికెట్ అసోసియేషన్ జట్టును ప్రకటించింది. బుధవారం నుంచి ప్రారంభంకానున్న రాబోయే రంజీ ట్రోఫీ సీజన్‌లో తొలి రెండు మ్యాచులకు యువ బ్యాట్స్‌మెన్, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. సకిబుల్ గని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 15న మోయిన్-ఉల్-హక్ స్టేడియంలో జరిగే ప్లేట్ లీగ్ సీజన్‌లో బీహార్ తన తొలి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో తలపడనున్నది. అయితే, గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయకపోవడంతో బిహార్‌ను ప్లేట్ లీగ్ దశకు కుదించారు.
వైస్ కెప్టెన్సీ వైభవ్ సూర్యవంశీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES