- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అమలులో హైకోర్టులో ఎదురైన అడ్డంకి నేపథ్యంలో వీలైనంత త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం ఈ ప్రకటన చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి రాష్ట్ర తాజా పరిణామాలను, బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన హైకోర్టు వ్యవహారాన్ని వివరించినట్లు గౌడ్ చెప్పారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలనే ప్రతిపాదనను ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలతో జూమ్ సమావేశం కూడా జరిగిందన్నారు.
- Advertisement -