– తల్లిపై కర్కశంగా తయారైన ప్రభుత్వ ఉద్యోగ కుమారులు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
సమాజంలో విద్యావంతులుగా ఉంటూ పాఠాశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తూ విద్యా బుద్ధులు నేర్పిస్తున్న వాళ్లు తమ సొంత కన్న తల్లిని పట్టించుకోకుండా ఆమెకు ఉన్న యావదాస్తిని రాయించుకొని కన్న తల్లి యోగ క్షేమాలు పట్టించుకోకుండా కర్కశంగా తయారైన కొడుకులు. బుక్కెడు బువ్వ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా తల్లి శంకరమ్మ కొడుకులు, కూతురుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఆమె రోదనలు ప్రతి ఒక్కరినికలిచివేసింది.
శంకరమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గద్వాల పట్టణానికి చెందిన ఈద శంకరమ్మ, వయస్సు 68 వీవర్స్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఇద్దరు కుమా రులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మంచి స్థానంలో ఉండగా వంశంపాఠ్యాంగా వచ్చిన ఆస్తులను ఇద్దరు కుమారులకు, కూతురి పేరిట సమాన భాగాలుగా ఆస్తి పంపకాలు జరిగాయని పెద్దలు ఒప్పందం ప్రకారం కుమారులు నెలకు రూ.10,000, కూతురు నెలకు రూ.2,000 తల్లికి ఇచ్చేవిధంగా పెద్దలు నిర్ణయించారని ఆమె తెలిపారు.
ఆస్తిని పంచుకున్న తర్వాత కన్న పిల్లలు ఆమెకు ఇవ్వాల్సిన నెలసరి ఖర్చులకోసం డబ్బులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. అనారోగ్య కారణాల వల్ల ప్రతినెల మందుల కోసం ఇబ్బంది అవుతుందని కొడుకులను డబ్బులు అడిగితే డబ్బుల కోసం వస్తేతన్ని తరిమేస్తామని తనను బెదిరించారని ఆమె ఏడుస్తూ మీడియా ముందు వాపోయారు.