యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
అంగన్వాడి టీచర్లకు పెండింగ్ లో ఉన్న గ్యాస్, సెంటర్ అద్దెలు, కూరగాయల,ఆరోగ్య లక్ష్మీ, టిఏడిఏ బిల్లులు వెంటనే చెల్లించాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ ప్రభుత్వానికి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంగన్వాడి టీచర్లకు నెలలు తరబడి గ్యాస్ బిల్లులు కూరగాయల బిల్లులు సెంటర్ల అద్దెలు,ఆరోగ్య లక్ష్మీ పెండింగ్లో ఉంటున్నాయని దీనితో సొంత ఖర్చులు పెట్టుకొని అంగన్వాడి కేంద్రాన్ని నడపాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్లు,ఆయాల పోస్టులు భర్తీ గాక పని ఒత్తిడి అంగన్వాడి ఉద్యోగులపై పనిభారం పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే టీచర్ల,ఆయా పోస్టులు భర్తీ చేసి,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు.
అంగన్వాడి టీచర్లకు పెండింగ్ బిల్లులు చెల్లచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES