నవతెలంగాణ – అచ్చంపేట
ఆర్థికంగా లేని నిరుపేద విద్యార్థుల చదువుకు సిబిఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనురాధ చేతనందిస్తూ ఆసరా నిలుస్తున్నారు. అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామానికి చెందిన సామెళ్ళ రామస్వామి కూతురు ఎస్. అనుష హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలో కాలేజీ ఆఫ్ ఆర్టికల్చర్ బిఎస్సి ఆర్టికల్చర్ రెండో సంవత్సరం చదువుతుంది.
నిరుపేద కుటుంబానికి చెందిన రామస్వామి ఆర్థికంగా వెనుకబడి ఉండడం వలన పై చదువులకు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. స్థానికులు అందరు గ్రామస్తులు విషయాన్ని పరిస్థితిని సిబిఎం ట్రస్టు చైర్పర్సన్ఎ, మ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సతీమణి అనురాధ మేడమ్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన డాక్టర్ అనురాధ అమ్మాయి బిఎస్సి ఆర్టికల్చర్ పూర్తి అయ్యేవరకు తమ వంతుగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. రెండవ సంవత్సరం ఫీజును విద్యార్థి అనుషకు రూ. 25,000 చెక్కు రూపంలో సోమవారం అందజేశారు. పేద నిరుపేద విద్యార్థుల కు ఉన్నత విద్య పరంగా ఆర్థిక సహాయం చేస్తున్న సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ కు విద్యార్థిని అనుష, తండ్రి రామస్వామి, గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.