నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిస్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. అలాగే ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహం- బి హాస్టళ్లల్లో ఆదివారం నాడు అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులతో సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకపూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ ల ఇంకా ఎందరో వీరుల ఆశయాల సాధన కోసం 1936 ఆగస్టు12 న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు.
మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని విద్యార్థులందరినీ ఏకం చేసి ఉద్యమాలు చేస్తూ జాతీయ స్థాయిలో నిలిచిన సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు. అలాగే చదువుతూ పోరాడు,చదువుకై పోరాడు అనే నినాదంతో ఏఐఎస్ఎఫ్ అనేక విద్యార్థుల సమస్యల కోసం పోరాటాలు చేసిందన్నారు. అదేవిధంగా విద్యారంగా సమస్యల పరిష్కారం కావాలంటే విద్యార్థులు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భరత్, కరుణాకర్, అంజి పాల్గొన్నారు.
హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES