Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుండెపోటుతో గడ్డం మహేందర్ మృతి..

గుండెపోటుతో గడ్డం మహేందర్ మృతి..

- Advertisement -

– ఆత్మగౌరవం కోసం ఆరాటపడ్డ నిస్వార్థ నాయకుడు..
– అనాధలైన భార్యా పిల్లలు..
– ఆర్థిక సాయం అందించిన బిజెపి సీనియర్ నాయకులు..
నవతెలంగాణ – ఊరుకొండ

సమాజంలో ఆత్మగౌరవం కోసం ఆరాటపడి.. తాను ఎత్తుకున్న జెండా కోసం కడవరకు నిలబడి.. కటిక పేదరికాన్ని కడుపులో మోస్తూ ఆత్మగౌరవం కోసం ఆరాటపడ్డ నిస్వార్థ నాయకుడు.. గెలుపుని అందుకోలేక ఓటమిని అంగీకరించలేక మధ్యలోనే గుండెపోటుతో అసువులు బాసిన గడ్డం మహేందర్ కు అన్ని పార్టీల నాయకులు ఘనంగా కన్నీటి నివాళులు అర్పించారు. సోమవారం కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన గడ్డం మహేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పెయింటింగ్ పనిచేసేందుకు కల్వకుర్తి పట్టణంలోని గుజ్జరి కృష్ణయ్య ఇంటికి పెయింటింగ్ పనిచేస్తూ మధ్యాహ్నం భోజనం చేసేందుకు కూర్చుని భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు.

దీంతో మహేందర్ ను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి తాను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఊరుకొండ మండల కేంద్రంలోని తన నివాసానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న అన్ని పార్టీల నాయకులు మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. బిజెపి మండల శాఖ నాయకులు 10వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న గడ్డం మహేందర్ అర్ధాంతరంగా మృతి చెందడంతో భార్య ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు. సమాజ సేవలో నిస్వార్ధంగా తన వంతు సహాయ సహకారాలు ప్రజలకు అందజేస్తూ.. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలతో కలుపుగోలుగా ఉండి ప్రేమగా పలకరించే గడ్డం మహేందర్ మృతి ఊరుకొండ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల ప్రజలను కంటనీరు పెట్టించింది. ఇలాంటి నాయకుడు మళ్లీ రాడు అని పలువురు  కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరి అండదండలు లేకుండా గడ్డం మహేందర్ మంజుల భారతీయ జనతా పార్టీ నుండి ఊరుకొండ మండల జడ్పిటిసి గా పోటీ చేయడం గమనార్హం. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -