నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రైతు సోదరులు వరిలో ఎండాకు తెగులు, సుడిదోమ వస్తున్నందున రైతులు తమ తమ పొలాల్లో గమనించి సరైన మందులను పిచికారి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ సూచించారు. బ్యాక్టీరియల్ ఎండకు తెగులు వచ్చిన పొలంలో రైతులు యూరియా వేయడం ఆపాలన్నారు. పొలంలో నీటిని తీసి వేసి సస్య రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.కాపర్ ఆక్సీ క్లోరైడ్ 600 గ్రాములు + ప్లాంట మైసిన్ 40 గ్రాముల మందును పిచికారి చేయాలన్నారు.వరిలో పొట్ట దశ (పూత వున్న) పొలాల్లో మాత్రం ఈ కాపర్ ( సిఓసి )మందును పిచికారి చేయొద్దన్నారు.
సుడి దోమ నివారణ చర్యలు…
రైతులు తమ వరి పొలంలో సుడిదోమ తెగులు గమనించినట్లైతే వెంటనే గాలి, ఎండ తగిలేలా పొలం పాయలు తీసి మందు మొక్క మొదళ్ళు పడేలా పిచికారి చేయాలన్నారు.పైమెట్రీ జైన్ 50% డబ్ల్యూజి,120 గ్రాములు/ ఎకరం పొలానికి లేదా ట్రై ఫ్లూమెజోపైరం (పెక్సాలన్ ) 94 మిల్లి లీటర్లు/ ఎకరం పొలానికి పిచికారి చేయాలని సూచించారు.