Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు అభినందనలు: ట్రస్మా

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు అభినందనలు: ట్రస్మా

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
లీడ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బెస్ట్ టీచర్ అవార్డు 20 25 గాను యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఎనిమిది మంది ని సెలెక్ట్ చేయడం జరిగిందని లీడ్ ఇండియా ఫౌండేషన్, ట్రస్మా రాష్ట్ర శాఖ సంయుక్తంగా తెలియజేసిందని జిల్లా ట్రస్మా  అధ్యక్షులు పాలకూర్ల వెంకటేశం,  ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీరాములు తెలిపారు. సోమవారం స్థానిక దేదీప్య హై స్కూల్లో జరిగిన జిల్లా ట్రస్ట్ మా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ..డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశాలకు అనుగుణంగా పాఠశాల స్థాయి నుండి సమాజంలో మార్పులు తీసుకురాగలిగేది ఉపాధ్యాయులు అని నమ్మిన సంస్థ అబ్దుల్ కలాం ఫౌండేషన్. 

ఈ ఫౌండేషన్ భారతదేశం 2047 ను మార్చే మార్గదర్శకుడిగా ఉపాధ్యాయుని తయారు చేయాలనేది లక్ష్యంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలియజేశారు. అవార్డు గ్రహీతలకు ఈ నెల 15న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రధానం చేయనున్నారని తెలిపారు.

అవార్డు గ్రహీతలు: 
మారేపల్లి మల్లారెడ్డి(మల్లికార్జున హై స్కూల్ చౌటుప్పల్), తుంగతుర్తి శేషగిరిరావు (దేదీప్య హై స్కూల్ భువనగిరి) తిరుగుడు మల్లికార్జున్ (వివేకానంద స్కూల్, రామన్నపేట), రవీందర్ రెడ్డి  (మోత్కూర్), మిట్టపల్లి విజయ్ కుమార్ (ఆలేరు) మల్లం వెంకటేశం (వలిగొండ), తోటకూర యాదయ్య (సాయి ప్రశాంతి స్కూల్. భువనగిరి), వెల్దుర్తి భాగ్యలక్ష్మి (యాదగిరిగుట్ట) లకు జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ట్రస్మ పక్షాన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మెరుగు మధు, సోమిరెడ్డి, పాండు, తుంగతుర్తి రంగారావు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -