Monday, October 13, 2025
E-PAPER
Homeజిల్లాలుసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తల్లోజు ఆచారి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తల్లోజు ఆచారి

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడి నిశ్చితార్దానికి రావాలని ఆహ్వానించారు. ఈనెల 31న తన కుమారుడైన తల్లోజి భరత్ నిశ్చితార్థం కార్యక్రమానికి రావాలని సీఎంను ఆహ్వానించినట్లు తెలిపారు. అనంతరం ఆమనగల్ మండల్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, నాలుగు మండలాలకు కూడలి అయినటువంటి ఆమనగల్ లో సబ్ రిజిస్టర్, మరియు ఎస్ టి ఓ, ఆర్ టి ఏ, కార్యారాలను ఆమనగల్ లో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజి ఆచారి, రేవంత్ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు అసిఫ్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి ఆనంద్ ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ఈమేరకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ మెంబర్ శ్రీ తల్లోజి ఆచారి గారు రేవంత్ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆసిఫ్ అలీ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి ఆనంద్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -