Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి..

తెలంగాణ బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
కేంద్ర ప్రభుత్వం ఓసీలు ఎవరు అడగకముందే.. ఈడబ్ల్యూఎస్ ఐదు శాతం ఉన్న ఓసీల కోసం 10% రిజర్వేషన్లు ఇస్తూ పార్లమెంట్ రాజ్యసభ రాష్ట్రపతిలా ద్వారా ఈడబ్ల్యస్ బిల్ ఆమోదం చేయించి, వారం పది రోజులలో దాన్ని ఈడబ్లెస్ అమలు చేయించిన మోడీ, అదే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి పంపితే గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్లో ఉంచారని సీపీఐ(ఎం) జిల్లా కమిటి సబ్యుడు సురేష్ గోండా అన్నారు.

 రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి నా బిల్లును ఎందుకు పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రపతి ద్వారా ఎందుకు ఆమోదించలేకపోయారు. ఎందుకు ఇన్ని రోజులు బీసీ బిల్లు పెండింగ్ లో ఉంది. మరి మోడీ గారు బీసీ కదా.. బీసీ రిజర్వేషన్ల బిల్లు దగ్గరుండి పాస్ చేయించాలి కదా.. అదే అగ్రకుల ఓసి ఈడబ్ల్యూ బిల్ ఎలా పాస్ చేయించారు. బిసి రిజర్వేషన్ల బిల్ ఎందుకు చేయిస్తాలేరు అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ. ఈ సందర్భంగా బీసీ సోదర సోదరీమణులారా .. ఒక్కసారి ఆలోచన చేయాలని, బీసీ సోదరులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర గవర్నర్ చేత కూడా ఆమోదం పొందకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని,  రాష్ట్రంలో ఉన్న బిజెపి కేంద్ర మంత్రులు, ఎంపీలు వెంటనే రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. లేదా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి బీసీ రిజర్వేషన్ 42 శాతం ప్రకటించే విధంగా కృషి చేయాలన్నారు. లేకపోతే రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని సురేష్ గొండ డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని లేకుండా చేస్తే తప్ప 42% రిజర్వేషన్లు సాధించుకునే పరిస్థితి లేదని అర్థమవుతుంది. కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే దిశగా బీసీలు రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితిని కేంద్ర బిజెపి ప్రభుత్వం కల్పించింది. కాబట్టి పోరాటం ద్వారా బీసీలు ఐక్యంగా పోరాటం ద్వారా బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి ఐక్యం కావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ద్వారా న్యాయపరమైన పద్ధతిలో కూడా బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేటట్లు చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -