- Advertisement -
- జీపీఎమ్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్..
- నవతెలంగాణ – జుక్కల్
- రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసి గొల్ల కురుమలకు రెండు లక్షల నగదు బదిలీతో రెండో విడత గొర్ల పంపిణీ చేయాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం జీపీఎమ్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ డిమాండ్ చేశారు. ఈ రోజు కామారెడ్డిలోని ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశానికి సురేష్ గోండా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన రవిందర్ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్నారని విమర్శించారు.
- రెండు సంవత్సరాల నుండి జీవాలకు కనీసం నట్టల మందు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రతీ రోజు వందలాది గొర్లు వివిధ ప్రమాదాల్లో చనిపోతున్నాయని, ఈ కుటుంబాలకు ఎలాంటి సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గొర్లకు ప్రభుత్వం ఉచిత ఇన్సూరెన్స్ పథకం పెట్టాలని కోరారు. పండుగల సందర్భంగా ఉచితంగా గొర్రెలు ఇవ్వాలని గ్రామ పెద్దలు, విడిసి ల వేధింపులు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలన్నారు. వివిధ ప్రమాదాల్లో చనిపోతున్న గొర్ల కాపర్లకు 10లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని కోరారు. గొర్ల పంపిణీ కోసం కొన్ని గ్రామాల్లో కట్టిన డిడిలను వాపస్ ఇవ్వకుండా, గొర్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే గొల్ల కురుమలను సమీకరించి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా సురేష్ గోండా, కో కన్వీనర్లుగా చెల్మేటి గంగాధర్, పెద్దోళ్ల కనుకరాజులను ఎన్నుకున్నారు.
- Advertisement -