Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ భూమి దున్నిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 

ప్రభుత్వ భూమి దున్నిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 

- Advertisement -

నవతెలగాణ – రాయపర్తి 
హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ సర్వే నెంబర్ 52 లో ఉన్న ప్రభుత్వ భూమిని ఇటీవల జేరిపోతుల వెంకన్న సాగు చేసేందుకు ట్రాక్టర్ తో దుక్కి దున్నించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు డిప్యూటీ తాసిల్దార్ గంకిడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం సర్వేయర్ కందారి వీరస్వామి, గిర్దావర్ కొయ్యడ చంద్ర మోహన్, జిపిఓ రాంప్రసాద్ లతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంచనామ జరిపినట్లు చెప్పారు. రెవెన్యూ చట్టాల ప్రకారం సదరు వ్యక్తిపై తాము జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో చర్యలు కోరుతూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల విషయంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేయాలని గుత్తేదారుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు ఆటంకం కలిగించే వ్యక్తులపై క్రిమినల్ కేసులకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -