అప్పటి ఎమ్మెల్యే అయినా ఇప్పటి మంత్రి సీతక్క వివోఏలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
వివోఎలా సంఘం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వెలిశాల సుధాకర్
నవతెలంగాణ – నెల్లికుదురు
మా ప్రభుత్వం వస్తే వివో ఏ లకు రూ 26 వేల రూపాయలు ఇస్తానని చెప్పిన ఇప్పటి ఎమ్మెల్యే ఇప్పటి మంత్రి సీతక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు వివో ఎ లా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెలిశాల సుధాకర్ తెలిపారు. మండల కేంద్రంలో ఐకెపి వివోఏల సంఘం మండల అధ్యక్షుడు హనుమంతు అధ్యక్షతన సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకుడు పెరుమాళ్ళ బాబు గౌడ్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ఐకెపి వివో ఎ లకు ప్రభుత్వం ఇస్తామన్న రూ.26000 వేతనం ఇవ్వాలని గ్రేడింగ్ తో సంబంధం లేకుండా వేతనం ఇస్తూ అదనపు పని భారం తగ్గించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం తక్షణమే కల్పించి వివో ఎలా కు C C ప్రమోషన్ కల్పించి జాబ్ చాటు ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేసినట్లు తెలిపారు.
గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 46 రోజులు వివో ఏ లో సమ్మె చేయడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న శీతక్క మా ప్రభుత్వం వస్తే 26 వేల రూపాయలు ఇస్తామని పీఎస్ఎల్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఎలక్షన్ ముందు మేనిఫెస్టో 20000 వేతనం ఇస్తామని పత్రిక ప్రకటన చేయడం జరిగింది అట్టి మాటలను తక్షణమే నిలబెట్టుకుని వివో ఎలా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివో ఏ ల మండల అధ్యక్షులు గుగులోతు హనుమంతు కోశాధికారి ఇంద్ర మంజుల అశోక్ రమేష్ సుజాత స్వప్న ఉష సరిత గడ్డల అశోక్ రాపాకి రమేష్ బాలాజీ శ్రీను తో పాటు మరికొందరు పాల్గొన్నారు.
వివోఏల సంగం సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES