జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను జిల్లా అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరెట్ సమావేశ మందిరంలో ప్రజవాణి లో పాల్గొని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నా వాటి పై దృష్టి సారించి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నేడు నిర్వహించిన ప్రజవాణి లో భూములకు సంబంధించి 20 ఫిర్యాదులు, డి పి ఓ కి 6,మున్సిపల్ కమిషనర్ లకి 6, స్త్రీ మరియు శిశు సంక్షేమ అధికారికి 4, ఇతర అధికారులకు 21 ఫిర్యాదులు మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయని వీటన్నింటిని సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరిగిందని, జాగ్రత్తగా అన్నిటిని పరిశీలించి ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించెందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. డిఆర్ డి ఏ పి డి వి వి అప్పారావు, హోజింగ్ పి డి సిదార్ధ, డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, డి సి ఓ పద్మ, డి ఇ ఓ అశోక్, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు , పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి,సూపర్టీడెంట్లు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES