Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం తీసుకోవాలి

సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – కోహెడ
గర్భిణీలు, బాలింతలు మహిళలు పౌష్టికాహారం తీసుకుంటెనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సీడీపీవో జయప్రద అన్నారు. సోమవారం మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో పోషణమాసం కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆహారంలో నూనె, ఉప్పు, చెక్కర వాడకాన్ని తగ్గించాలని, అంగన్‌వాడీలో ఇచ్చే ఆహారాన్ని తప్పక తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ కవిత, ఎమ్‌ఎల్‌హెచ్‌పీ అనూష, ఏఎన్‌ఎం సునీత, ఆశాకార్యకర్త తార, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -