Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్మషం లేని కార్యకర్తను కోల్పోయాం..

కల్మషం లేని కార్యకర్తను కోల్పోయాం..

- Advertisement -

– గడ్డం మహేందర్ మృతి పార్టీకి తీరని లోటు.
– దళిత నాయకుడికి నివాళులు అర్పించిన ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్.
నవతెలంగాణ – ఊరుకొండ 

పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పని చేసిన కల్మషం లేని కార్యకర్త.. నిస్వార్థ నాయకుడు గడ్డం మహేందర్ ను కోల్పోయామని.. గడ్డం మహేందర్ మృతి పార్టీకి తీరని లోటు అని ఓబీసీ జిల్లా అధ్యక్షులు, నర్సంపల్లి మాజీ సర్పంచ్ వాగులుదాస్ నిరంజన్ గౌడ్ అన్నారు. సోమవారం గుండెపోటుతో మృతి చెందిన ఊరుకొండ గడ్డం మహేందర్ ను ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ తన కార్యకర్తలతో వచ్చి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాయిత కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చి… తన వంతు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకట్ నర్స్, తాడెం చిన్న, సల్వాది శేఖర్, ఆనంద్ గౌడ్, తిరుపతి రెడ్డి, నరేందర్ గౌడ్, డాన్ శివ, వాగుదాస్ లావణ్య నిరంజన్ గౌడ్, పలువరు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -