Tuesday, October 14, 2025
E-PAPER
Homeఖమ్మంస్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలో సత్తా చాటిన స్థానిక విద్యార్ధిని

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలో సత్తా చాటిన స్థానిక విద్యార్ధిని

- Advertisement -

– అండర్ 14 విభాగంలో అథ్లెటిక్స్ లో రాణింపు
– ఉమ్మడి జిల్లా క్రీడలకు ఎంపికైన అనూష
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఇటీవల జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెంలో, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో అశ్వారావుపేట బాలికోన్నత పాఠశాల 8 వ తరగతి విద్యార్ధిని అనూష తన సత్తా చాటింది. అండర్ 14 విభాగం లో అథ్లెటిక్స్ క్రీడల్లో విజయం సాధించి ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ కు ఎంపికైంది. 400 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానం,4×100 మీటర్ల పందెంలో ద్వితీయ స్థానం,4×400 తృతీయ స్థానంలో రిణించి ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయికి ఎంపికైంది. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలకు జిల్లా గుర్తింపు తెచ్చిన అనూష ను ప్రధానోపాద్యాయులు నల్లపు కొండల రావు,వ్యాయామ ఉపాధ్యాయురాలు పద్మజ, ఇతని బోధనా ఉపాద్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -