- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట సైదాపురం సోమవారం, పోలీసులు పోలీస్ స్టేషన్ సిబ్బందితో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజలకు సీసీ కెమెరాల యొక్క విశిష్టతను, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కలిగించి సోషల్ మీడియా వల్ల జరుగుతున్న ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ గురించి అవగాహన కల్పించారు. అట్టి ఫ్రాడ్స్ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసి గ్రామ యువకులు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు జరిగినచో పోలీసు వారికి సమాచారం ఎలా ఇవ్వాలి అని 112 టోల్ ఫ్రీ నెంబర్ యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -