‘లవ్ టుడే, డ్రాగన్’ వంటి రెండు వరుస హిట్స్ తరువాత హీరో ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’తో దీపావళికి అలరించబోతున్నారు. మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమా ఈనెల 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మమిత బైజు సోమవారం మీడియాతో ముచ్చటించారు.
దర్శకుడు కీర్తిశ్వరన్ ఈ కథను చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. కాన్సెప్ట్ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. నేను పోషించిన కురల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు.
కురల్ చాలా హానెస్ట్ క్యారెక్టర్. ఆమె తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది. చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా ఉంటుంది. అలాగే సూటిగా మాట్లాడుతుంది. ఈ పాత్ర చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. అంతేకాదు చాలా ఛాలెంజింగ్ పాత్ర చేశాననిపించింది. అలాగే ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా నాకు సవాల్‌గా అనిపించాయి. ఆ సీన్స్ కోసం నేను రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పనిచేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఏ సీన్ అయినా సహజంగా, సంతోషంగా మార్చేస్తారు. మా పాత్రల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
శరత్ కుమార్ లాంటి సినియర్ యాక్టర్‌తో కలిసి పని చేయడం అదష్టంగా భావిస్తున్నాను. కీర్తిశ్వరన్ చాలా క్లియర్ విజన్‌తో ఉంటారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ బిగ్ ఎసెట్. పాటలు, నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటాయి. నికేత్ బొమ్మి విజువల్స్ సినిమాకి జీవం పోశాయి. మైత్రీ మూవీ మేకర్స్‌తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్‌గా తీశారు.
ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేశా..
- Advertisement -
- Advertisement -