సందీప్ కిషన్ హీరోగా రూపొందిన కొత్త ప్రాజెక్ట్ సూపర్ సుబ్బు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ. ‘ఈ కథ ఆలోచన ఒక అబ్జర్వేషన్ నుంచి పుట్టింది. ఈ రోజుకీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మనం ఇంకా గుసగుసలలోనే మాట్లాడుతున్నాం. తల్లిదండ్రులు దాన్ని దాటవేస్తారు. పాఠశాలలు విస్మరిస్తాయి, పిల్లలు అపోహలతో పెరుగుతారు. ఆ మౌనాన్ని ఒక కథగా మార్చాను. సుబ్రహ్మణ్యం అనే పాత్ర ద్వారా అవగాహనను ఎలా కలిగిస్తుందో ఇందులో చూడొచ్చు. మాఖీపూర్ ప్రజల అపోహలు, ఆప్యాయత.. ఇవన్నీ మనందరికీ తెలిసిన గ్రామ జీవనాన్ని గుర్తు చేస్తాయి’ అని తెలిపారు.
‘ఇది నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టుల కంటే పూర్తిగా భిన్నమైనది’ అని నటి మిథిలా పాల్కర్ చెప్పారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, ‘ఇప్పుడు మనం ఒక అందమైన కథా కాలంలో ఉన్నాం. కథలు మరింత ధైర్యంగా, భావోద్వేగంగా, మన జీవితాల్లో భాగంగా అనిపించేలా మారాయి. ఈ కథ విన్న వెంటనే ఇది చెప్పదగ్గ నిజమైన కథ అని నమ్మాను. పాత్రల ఉత్సాహం, రచనలోని హాస్యం..ఇవన్నీ సిరీస్ మొత్తాన్ని చిరునవ్వుతో నింపుతాయి’ అని అన్నారు. ఈ సిరీస్‌కు నిర్మాత: రాజీవ్ చిలకా.
ఆ మౌనానికి ప్రతిరూపమే ‘సూపర్ సుబ్బు’
- Advertisement -
- Advertisement -