పలు జిల్లాల్లో అకాలవర్షాలు
హైదరాబాద్ : తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉదయం ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్‌తో పాటు కరీంనగర్, పెద్ధపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాల తిరోగమనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES