లైంగిక వేధింపులపై దర్యాప్తు జరపాలి : ఎంపీ ప్రియాంక డిమాండ్
తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురంలో ఓ టెకీ ఆత్మహత్య ఆరెస్సెస్‌కు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నది. కారణం.. సదరు యువకుడు సోషల్ మీడియాలో నోట్ చేసిన ఆరోపణలే. తాను తన బాల్యం నుంచి ఆరెస్సెస్ శిబిరాల్లో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నానని, అనేక మంది ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారని అందులో ఆరోపించాడు. అయితే ఈ విషయంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఆ యువకుడు చేసిన ఆరోపణలను సోషల్ మీడియా పోస్టులో ఆమె లేవనెత్తారు. ఆరెస్సెస్ నాయకత్వం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొట్టాయంలోని పొంకున్నంకు చెందిన ఆనందు అజి (24) తిరువనంతపురంలోని ఒక లాడ్జ్ గదిలో చనిపోయాడు. ఆయన మరణించిన తర్వాత ఓ వివరణాత్మక పోస్ట్ సోషల్ మీడియా వచ్చేలా షెడ్యూల్ చేశాడు. ఆయన బాల్యం నుంచి ఆరెస్సెస్ శిబిరంలో పదేపదే లైంగిక వేధింపులకు గురయ్యాడని తన పోస్ట్‌లో ప్రియాంక ఆరోపించింది. ఆయన ఆరెస్సెస్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఎదుర్కొంటున్న కష్టాల గురించి మాట్లాడగలిగాడని ఆమె పేర్కొన్నారు.
ఆరెస్సెస్ క్యాంపుల్లో అఘాయిత్యాలా..!
- Advertisement -
- Advertisement -