– పాలస్తీనాను గుర్తించమని నినాదాలు
– ఇజ్రాయిల్ పార్లమెంటులో పోస్టర్స్ ప్రదర్శన
ఇజ్రాయిల్ పార్లమెంటులో సోమవారం ట్రంప్ ప్రసంగిస్తుండగా వామపక్ష సభ్యులు అడ్డుకుని నిరసన తెలిపారు. వామపక్ష హడాష్ పార్టీ ఎంపీలు ఓపర్ కాసిఫ్, ఐమన్ ఒడే ‘ మారణహోమం ‘ అంటూ నినాదాలు చేశారు. పాలస్తీనాను గుర్తించమని వారు పోస్టర్స్‌ను ప్రదర్శించారు. ఖంగుతిన్న ట్రంప్ కొద్ది నిమిషాలు తన ప్రసంగాన్ని నిలిపేశారు. పార్లమెంట్ భద్రతా సిబ్బంది బలవంతంగా వారిని బయటికి తీసుకుపోయారు. అనంతరం స్పీకర్ అమీర్ ఒహానా ట్రంప్‌కు క్షమాపణలు చెప్పి ప్రసంగాన్ని కొనసాగించమని కోరారు. ఆ తరువాత ట్రంప్ మాట్లాడుతూ మీరు ‘చాలా సమర్థవంతంగా పని చేశారు ‘ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే నిరసన తెలిపిన ఎంపీ ఓపర్ కాసిఫ్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్పందిస్తూ నేను నా స్నేహితుడు సభను కలవరపరచాలని కాదు, న్యాయం కోసం నినదించాం. అక్రమణ, వివక్షత అంతమై ఇజ్రాయిల్‌తో పాటు పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పుడే నిజమైన శాంతి, అభివృద్ది సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజాస్వామిక వాదులు రక్తసిక్త నెతన్యాహు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని కోరారు. కాగా ట్రంప్ పార్లమెంట్ సభలో ఓ వైపు శాంతి ప్రవచనాలు వల్లీస్తూనే అమెరికా ఆయుధ సహకారంతో ఇజ్రాయిల్ చాలా సాధించుకుందని, మీరు యుధ్ద భూమిలో ఉగ్రవాదులపై గెలిచారు, మారుతున్న క్షణాన్ని గుర్తుంచుకొండి అన్నారు. ఇజ్రాయిల్ దాడులతో ద్వంసమైన గాజాకు సహాయమందిస్తామని, పాలస్తీనియన్లు హింసా మార్గం వీడాలని, శాంతి కోసం కృషి చేయాలని యుద్ద నేరస్తుడు నెతన్యాహూను ప్రక్కన పెట్టుకుని చెప్పటం గమనార్హం..
కాల్పుల విరమణను స్వాగతించిన పాలస్తీనా కమ్యూనిస్టు పార్టీ..
గాజాలో కాల్పుల విరమణను పాలస్తీనా కమ్యూనిస్టు పార్టీ స్వాగతిస్తూ అదివారం ప్రకటన విడుదల చేసింది. రక్తపాతాన్ని ఆపడానికి, పౌరజీవితాలను రక్షించడానికి ఇది దోహదపడాలని ఆకాంక్షించింది. అయితే శాశ్వత శాంతికి ట్రంప్ 20 సూత్రాల ఒప్పందం పని చేయదని విమర్శించింది. పాలస్తీనా ప్రజలకు దురాక్రమణ, అణచివేత, సామాజ్రవాద ఆధిపత్యం నుండి విముక్తి కలిగినప్పుడే నిజమైన ఉపసమనం అని పేర్కొంది. శాశ్వత పరిష్కారానికి ఇజ్రాయిల్ దళాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, 1967 నాటి సరిహద్దులతో జెరుసలెం రాజధానిగా పాలస్తీనా దేశంను గుర్తించాలని, అంతర్జాతీయ సమాజం అండగా నిలవాలని, సహాయం అందించాలని పాలస్తీనా కమ్యూనిస్టు పార్టీ ప్రకటనలో కోరింది.
ట్రంప్ ప్రసంగాన్ని అడ్డుకున్న వామపక్ష ఎంపీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES