బుర్ర శ్రీనివాస్ గౌడ్ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమరభేరి మోగించాలని కెవిపిఎస్ ములుగు జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని రాంపూర్ తాటి వనంలో కళ్ళు గీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాస గౌడ్ హాజరై క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు.
కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న చలో ఇంద్ర పార్క్ నిరాహార దీక్ష లను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందని రెండు సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు ఒక హామీ కూడా నెరవేర్చక పోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈమూడు సంవత్సరాల పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా లను మరియు తాడి కార్పొరేషన్ చెక్కులను కూడా తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ఏరియాలో రద్దు చేసిన సొసైటీల విషయంపై ముఖ్యమంత్రి స్పందించి సొసైటీలను పునరుద్దరణ చేయాలని అన్నారు.
గత మూడు సంవత్సరాలుగా 50 సంవత్సరాల నిండిన కల్లుగీత కార్మికులకు పెన్షన్ సైట్ ఓపెన్ చేయకుండా పెన్షన్ రాకపోవడంతో గీతా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతి గీత కార్మికునికి టూ వీలర్ బైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది లక్షలు ఎక్స్ గ్రేషియా జీవో తక్షణమే విడుదల చేయాలని వారు అన్నారు. కల్లు గీత కార్మికుల సమస్య ల పైన ప్రభుత్వనిర్లక్ష్యం ను నిరసిస్తూ ఈ నెల 17నచలో ఇంద్ర పార్క్ నిరాహార దీక్ష పెట్టడం జరిగిందని అప్పటికి ప్రభుత్వం తీర్చకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సోసైటీ అధ్యక్షులు జక్కు రాజు గౌడ్ మండల ఉపాధ్యక్షులు మేరుగు సుధాకర్ గౌడ్ , గండు రాంబాబు గౌడ్ పూజారి సారంగం గౌడ్ బుర్ర వెంకన్న గౌడ్ బొమ్మగాని షణ్ముఖ గౌడ్ జక్కు మొగిలి గౌడ్ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ పంజాల ఉదయ్ కుమార్ గౌడ్ పెరుమాండ్ల రవీందర్ గౌడ్ తోపాటు 15 మంది పాల్గొన్నారు.



