- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి వద్ద గల గురుకుల పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా డార్మెటరీ హాల్ కూలిపోయింది. విద్యార్థులంతా తరగతి గదిలోనే ఉండడంతో ఎవరికి గాయాలు కాలేదని తెలిసింది. ఒకవేళ రాత్రిపూట ఈ ఘటన జరిగితే విద్యార్థులకు నష్టం జరిగేది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -