Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాల్లో చేరాలని బొట్టు పెట్టి ఆహ్వానం

మహిళా సంఘాల్లో చేరాలని బొట్టు పెట్టి ఆహ్వానం

- Advertisement -

– 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రత్యేక ఆహ్వానం 
– వేల్పూర్ లో మొదటి సంతోషిమాత వృద్ధుల సంఘం ఏర్పాటు 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో 60 ఏళ్లు దాటిన వృద్ధులను మహిళ సంఘాల్లో చేరాలని బొట్టు పెట్టి ప్రత్యేక ఆహ్వానంతో ఐకేపీ  సిబ్బంది వినుత్న ప్రయత్నం చేస్తున్నారు. మహిళ సంఘాలను బలోపేతం చేయడం కోసం ఐకేపీ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం చేస్తూ 60 ఏళ్లు దాటిన వృద్ధులను సంఘాల్లో చేర్చుకుంటున్నారు. అందులో భాగంగా మంగళవారం వేల్పూర్ గ్రామంలో ఐకేపీ సిసి ఏడేల్లి రవి, గ్రామ సంఘాల ప్రతినిధులతో కలిసి సర్వే నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఇప్పటి వరకు సంఘాల్లో లేని వారిని గుర్తించి కొత్త సంఘాల ఏర్పాటు కోసం బొట్టు పెట్టి సంఘాల్లోకి ఆహ్వానించారు. గుర్తించిన వృద్ధులందరితో సమావేశం నిర్వహించి, వారికి సంఘాల్లో చేరాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కల్పించారు.

అనంతరం  వేల్పూర్ లో మొదటి సంతోషి మాత వృద్ధుల సంఘం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఐకేపీ సిసి ఏడేల్లి రవి మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రత్యేక సంఘాల ఏర్పాటు చేస్తున్నామని, వీరికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించాబోతుందని అన్నారు. వికలాంగులు కూడా తప్పనిసరిగా సంఘాల్లో చేరలని, 15 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు కిషోర బాలికలకు కుడా ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంఘాల్లో లేని 60 సంవత్సరాలు దాటిన వృద్దులను గుర్తించేందుకు ఈ సర్వే దోహదపడుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఐకేపీ విఓఏలు అన్నపూర్ణ, మాధురి, లావణ్య, కావ్య,  మానస, గ్రామ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad