- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ను నేరుగా రైతుల ఖాతాల్లో సోమవారం జమ చేసింది. వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు సన్నాలకు రూ. 1429.91 కోట్లు విడుదల చేసింది. మొదటి రూ. 629 కోట్లు, రెండో విడత రూ. 300 కోట్లు, మూడో విడత రూ. 500 కోట్లు జమ చేసింది. సన్నాలకు బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్‌కు రూ. 2,889 మద్దతు ధర చెల్లిస్తోంది.
- Advertisement -



