దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సి హెచ్. శ్రీనివాస్ రెడ్డి..
నవతెలంగాణ – తొగుట: నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి అని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సి హెచ్. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో 13 మంది లబ్ధిదారుల కు రూ. 6. 25 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి నిరుపేద కుటుంబాలకు ఎంత గానో ఉపయోగపడుతుందని అన్నారు. పేదల కోసం దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. నియోజవర్గంలోని ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్య క్షులు అక్కం స్వామి, మాజీ ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చెరుకు విజయ్ (అమర్) సీనియర్ నాయకులు చిలివేరి రాంరెడ్డి, కొంగరీ నర్సింలు, సోలిపేట ప్రసా ద్ రెడ్డి, విజయ్ పాల్ రెడ్డి, పద్మ రెడ్డి, భూపాల్ రెడ్డి, సిద్ధి శ్రీనకర్ రెడ్డి, దేవునూరి పోచయ్య, డైరక్టర్ అల్వాల కృష్ణ గౌడ్, భరత్, స్వామి, లింగాల క్రిష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, భాను, ప్రశాంత్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం.. సీఎం సహాయనిధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES